ETV Bharat / crime

ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు అపహరణ - chain snatching in jawahar nagar ps area

హైదరాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​లు కలకలం సృష్టిస్తున్నాయి. సికింద్రాబాద్​లో ఇటీవల దొంగతనాలు ఎక్కువవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి తిరుగు పయనమైన మహిళ మెడలోంచి బంగారు ఆభరణాన్ని గుర్తు తెలియని దుండగుడు అపహరించాడు. జవహర్​నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దొంగతనం జరిగింది.

chain snatching in jawahar nagar ps area
జవహర్​ నగర్​ పీఎస్​ పరిధిలో చైన్​ స్నాచింగ్​
author img

By

Published : May 8, 2021, 4:34 PM IST

రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగుడు బంగారు ఆభరణాన్ని అపహరించాడు. సికింద్రాబాద్​ జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్​రావు నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లా బచ్చన్న పేటకు చెందిన సుజాత.. మోహన్ రావు నగర్​లో తన కూతురు దగ్గరికి ఇటీవలే వచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బైక్​పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తన మెడలోని బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు. అప్రమత్తమైన ఆమె వెంటనే జవహర్​నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.