ETV Bharat / crime

ఒంటరి మహిళలే టార్గెట్.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఒకేరోజు ఆరుచోట్ల..

chain snatchers
chain snatchers
author img

By

Published : Jan 7, 2023, 11:33 AM IST

Updated : Jan 7, 2023, 5:07 PM IST

11:29 January 07

Live Video : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన గొలుసు దొంగలు

ఒంటరి మహిళలే టార్గెట్‌గా రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా తెంపుడుగాళ్లు మళ్లీ విరుచుకుపడ్డారు. అదును చూసి మళ్లీ గొలుసులు తెంచుకెళ్లారు. వాడవాడల్లో సీసీ కెమెరాల నిఘా, నేర దర్యాప్తులో నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్‌ అంటేనే హడలెత్తిన ముఠాలు.. ఏడాది తర్వాత మరోమారు రెచ్చిపోయాయి. ఉదయం ఒక్కసారిగా రెచ్చిపోయిన గొలుసు దొంగలు.. హైదరాబాద్‌ వాసులను ఉలిక్కిపడేలా చేశారు. దాదాపు రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం 6:20 గంటల నుంచి 8:10 గంటల వరకు వివిధ చోట్ల హడలెత్తించారు.

ఉప్పల్‌ పరిధిలోని రాజధాని ప్రాంతంతో పాటు కల్యాణపురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, హబ్సిగూడాలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ఆగంతకులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.

చోరీ చేసిన ద్విచక్రవాహనంపై వచ్చి ఉప్పల్‌ చౌరాస్తాకు సమీపంలో తొలుత ఓ గొలుసు తెంచుకెళ్లిన ఇద్దరు దుండగులు.. కల్యాణిపురి కాలనీలో ఓ వృద్ధురాలి బంగారు నగలను అపహరించుకుపోయారు. హబ్సిగూడ రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు పూలు తెంపుతుండగా.. పల్సర్‌ బైక్‌పై వచ్చి అడ్రస్‌ అడుగుతున్నట్లు నటిస్తూ అదును చూసి గొలుసు తెంచుకుని ఉడాయించారు. నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగేంద్రనగర్‌లో ఇంటి ముందు విమల అనే వృద్ధురాలు ముగ్గు వేస్తుండగా.. పువ్వులు కావాలంటూ దగ్గరకు వచ్చి ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.

"పొద్దున నేను ముగ్గు వేస్తుంటే ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వచ్చారు. అందులో నుంచి ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి అమ్మా.. ఇక్కడ పూలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. నేను అతణ్ని చూసి అక్కడుంటాయని పూలున్న వైపు చూపించాను. అనుమానమొచ్చి నువ్వెకడుంటావు బాబు అని అడిగాను. అప్పుడు అతను ఆ రెడ్ కలర్ బిల్డింగ్‌ అని ఓ వైపు చూపించాడు. నేను అటు తిరిగేసరికి వెంటనే నా మెడలో నుంచి బంగారు గొలుసు తీసుకొని వెళ్లిపోయాడు." - బాధితురాలు

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ కృష్ణానగర్‌ కాలనీలో జ్యోతిబిన్‌ అనే మహిళ 8 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెంబడించిన దుండగులు.. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును అపహరించుకుపోయారు.

"నేను ఉదయం పని మీద బయటకు వెళ్తున్నాను. నా దగ్గరికి ఇద్దరు బైక్‌పై వచ్చారు. ఓ వ్యక్తి బైక్ నుంచి దిగి నా దగ్గరికి వచ్చి ఏదో అడ్రస్ గురించి అడిగాడు. నేను అది చెప్పేలోగానే నా మెడలో నుంచి చైన్ లాక్కొని ఎత్తుకెళ్లాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఇద్దరూ కలిసి బైక్‌పై పారిపోయారు." - బాధితురాలు

చోరీలు చేసిన తర్వాత గొలుసు దొంగలు ద్విచక్ర వాహనాన్ని ప్యారడైజ్‌ వద్ద వదిలివెళ్లారు. అప్పటికే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. గొలుసులు తెంచుకెళ్లింది దిల్లీ ముఠాననే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్‌పై దృష్టి పెట్టారు. రైల్వేస్టేషన్‌లతో పాటు పలు ప్రాంతాల్లోనూ వాహన తనిఖీలూ నిర్వహించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గొలుసు దొంగల ముఠా కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కాచిగూడ నుంచి వరంగల్‌ వెళ్లే రైలులో ఇద్దరు అనుమానితులను కాజీపేట్‌ వద్ద వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Last Updated : Jan 7, 2023, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.