ETV Bharat / crime

లైవ్​ వీడియో: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్ర బాలుడు మృతి - accident at ichoda bypass

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన బాలుడు మరణించాడు. జాతీయ రహదారిపై లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

accident at ichoda bypass
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 12, 2021, 7:12 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ వద్ద ఈ నెల 11న జరిగిన ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన పదిహేనేళ్ల బాలుడు విపుల్ మరణించాడు. గుడిహత్నూర్ మండలం ముత్నూర్​లో విపుల్​ మేనమామ విలాస్​ నివాసం ఉంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇద్దరు కలిసి ఇచ్చోడ మండలం సిరిసెల్మలోని శివాలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిపై బైక్​పై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది.

క్షతగాత్రులను స్థానికులు ఆదిలాబాద్​లోని రిమ్స్​ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విపుల్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

లైవ్​ వీడియో: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి: మొబైల్​ నెట్​వర్క్​ మోసం.. లక్షలు స్వాహా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.