ETV Bharat / crime

YS Viveka murder case: పులివెందులలో వివేకా ఇంటికి మరోసారి సీబీఐ - Telangana news

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం సాయంత్రం వివేకా ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇంటి పరిసరాలను కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు. బుధవారం కూడా సీబీఐ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

YS Viveka murder case, cbi on viveka murder case
వివేకా హత్య కేసు, వివేకా హత్య కేసుపై సీబీఐ
author img

By

Published : Sep 15, 2021, 9:56 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వివేకా ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. బుధవారం కూడా సీబీఐ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

2019 మార్చి 15న వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోనే కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి మాజీ మంత్రిని దుండగులు హతమార్చారు. ఆ తరువాత విచారణ సమయంలోనూ రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారుతూ వచ్చాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ కొంతకాలంగా విచారణ వేగం పెంచింది. అనుమానితులను అందర్నీ పిలిచి విచారించింది. హత్య కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసింది.

వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధిస్తున్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం ఇటీవల తనిఖీలు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎట్టకేలకు వాటిని కనుగొన్నారు. అనుమానితుల ఇళ్లలోనే అధికారులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న సునీల్ యాదవ్‌ను ఇచ్చిన కీలక సమాచారంతో అధికారులు మారణాయుధాల ఆచూకి కనుగొన్నారు.

పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు మంగళవారం మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాలైన బెడ్‌రూం, బాత్‌రూంను పరిశీలించారు. మరోసారి సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేశారు. ఇంటి పరిసరాలను కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు. ఆరుగురు సీబీఐ(CBI) అధికారులు టీషర్టులకు పేర్లు రాసి వారి ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. ఇద్దరు దుండగులు పల్సర్‌ బైకుపై వివేకా ఇంటి వద్దకు వచ్చినట్టు.. వారిలో ఒకరు గేటు తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయినట్టు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్​ చేశారు. మరో ముగ్గురు అధికారులు నిందితుల్లా ట్రయల్స్‌లో పాల్గొనగా.. వారు వివేకా ఇంటి ముందు నుంచి ఒకే బైకులో వెళ్లిపోవడాన్ని సీబీఐ వీడియో తీసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి హత్య జరిగిన రోజు పల్సర్ బైకులోనే వివేకా ఇంటికి వచ్చినట్టు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తెలిపారు. ఆ నేపథ్యంలోనే వారు ఎలా వచ్చి ఉంటారో ఊహిస్తూ సీబీఐ వీడియో తీసింది. బుధవారం కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు.

ఇదీ చదవండి: Viveka Murder Case: వివేకా హత్య కేసులో మళ్లీ సీన్ రీకన్​స్ట్రక్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.