మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. ఇవాళ దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీలోని కడప జిల్లా పులివెందుల కేంద్రంగా.. పలువురు అనుమానితులను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వ్యవసాయ పనులు చూసే రాజశేఖర్, కారు మాజీ డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించింది. వివేకా పొలాన్ని కౌలుకు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని విచారించింది.
వారం పాటు పలువురు అనుమానితులను విచారించిన సీబీఐ అధికారులు... ఇవాళ పులివెందుల నుంచి దిల్లీ వెళ్లిపోయారు. మళ్లీ ఎపుడు వస్తారనేది తెలియాల్సి ఉంది. వివేకా కేసులో అనుమానితులుగా ఉన్న కొందరిని దిల్లీలో విచారిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: భర్తతో విభేదాల కారణంగా పురుగుల మందు తాగిన మహిళ