మూడురోజుల క్రితం వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లిలో జరిగిన కారు ప్రమాద ఘటనలో ఎస్సార్ఎస్పీ కాలువలో గల్లంతైన డ్రైవర్ రాకేశ్ మృతదేహం లభ్యమైంది. కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహాన్ని రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో పోలీసులు గుర్తించారు.
మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి పోలీసులకు... గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాకేశ్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి శవపరీక్ష నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు వెల్లడించారు.