నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కారు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులకు బోధన్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొబ్బరిబోండాల కత్తితో భార్యపై భర్త దాడి