Car Accident in Kurnool : కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. స్థానిక వీసీ కాలనీలో రహదారిపై కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి... మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది దేవనగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన గొలుసు దొంగలు... ఐదు చోట్ల...