ఓ వైపు రాత్రి వేళ లాక్‌డౌన్ కొనసాగుతుండగా బహిరంగ ప్రదేశంలో పుట్టిన రోజు వేడుక నిర్వహించటమే నేరం... అలాంటిది వేడుకల్లో మారణాయుధం తల్వార్‌తో వేడుక జరుపుకున్నాడు ఓ యువకుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంతో... జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.
పెగడపల్లి మండలం ఏల్లాపూర్ గ్రామానికి చెందిన రంగు వేణు అనే యువకుడి పుట్టిన రోజు వేడుకను... తన స్నేహితులతో బహిరంగ ప్రదేశంలో జరుపుకుని తల్వార్‌తో కేక్ కోశాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వైరల్‌గా మారటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వేడుకల్లో 14 మంది పాల్గొన్నట్లు గుర్తించి... వారిపై కేసు నమోదు చేసినట్లు పెగడపల్లి ఎస్ఐ.అశోక్ తెలిపారు.
ఇదీ చూడండి: ETALA: 'డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి పోరాటం'