ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case: ముగిసిన శిల్పా చౌదరి కస్టడీ... ఆమె బ్యాంకు లాకర్లలో ఏమున్నాయంటే..!

Shilpa Chowdary in Police Custody: ఉప్పర్​పల్లి కోర్టు అనుమతితో శిల్పా చౌదరిని పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు. శిల్పా బ్యాంకు లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు… ఈరోజు వాటిని తెరిచారు. ఆమె ఖాతాలో పెద్దగా నగదు లేకపోవడంతో… లాకర్లను పోలీసులు తెరవగా వారికి ఊహించని షాక్ తగిలింది.

Shilpa Chowdary Cheating Case
కస్టడీలో శిల్పా చౌదరి
author img

By

Published : Dec 14, 2021, 2:38 PM IST

Updated : Dec 14, 2021, 11:41 PM IST

lockers open in axis bank: శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. ఒక రోజు కస్టడీలో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్​ను తనిఖీ చేశారు. కోకాపేట్​లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. లాకర్​లో ఏమీ లభించకపోవడంతో శిల్పాను తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

లాకర్లు తెరిచిన పోలీసులు

Shilpa bank accounts: శిల్పా బ్యాంకు లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు… ఈ రోజు వాటిని తెరిచారు. శిల్పా బ్యాంకు ఖాతాలో పెద్దగా నగదు లేకపోవడంతో… లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. నార్సింగి పీఎస్​లో ఆమెపై 3కేసులు నమోదు చేశారు. రూ. 7కోట్లు తీసుకొని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో మోసం

shilpa frauds: శిల్పా పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం గురించి బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకూడదనే శిల్పా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పాతో పాటు.... ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారు... వాళ్లకు వీళ్లకు సంబంధం అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో వ్యాపార సంబంధాలు నెరిపిన వాళ్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరిని రేపు ఉదయం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చి, అక్కడి నుంచి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించనున్నారు.

ఇదీ చూడండి: Shilpa Fraud: పార్టీలు ఇచ్చి ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి..

Last Updated : Dec 14, 2021, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.