ETV Bharat / crime

Electric shock: విద్యుదాఘాతం... 32 గేదెలు దుర్మరణం - mancherial crime news

విద్యుదాఘాతం 32 గేదెలు మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడలో జరిగింది. ఈ ఘటనకు విద్యుత్​ శాఖ అధికారులే బాధ్యులని.. వారిపై చర్యలు తీసుకోవాలని పశువుల యజమానులు కోరారు.

buffaloes died at mancherial
విద్యాదాఘాతంతో 32 గేదెలు మృతి
author img

By

Published : Jun 27, 2021, 4:42 PM IST

Updated : Jun 27, 2021, 4:52 PM IST

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో (Electric shock)32 గేదెలు మృతిచెందాయి.

రోటిగూడ గ్రామశివారులో మేతకు వెళ్లిన పశువుల మంద.. తెగిపడిన విద్యుత్​ తీగలను తాకడం వల్ల ఒక్కసారిగా నేలకొరిగాయి. సమాచారం అందుకున్న యజమానులు.. మృత్యువాత పడిన పశువులను చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. పాడి పరిశ్రమతోనే ముడిపడిన తమ జీవితాలకు ఇప్పుడు ఆధారం ఏంటంటూ రోధించారు. ఈ ఘటనకు విద్యుత్​ శాఖ అధికారుల కారణమని ఆరోపించారు. వారే తమకు న్యాయం చేయాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎన్పీడీసీఎల్ (NPDCL)​ ఎస్​ఈ రమేష్​బాబు.. ఒక్కో పశువుకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: కేసీఆర్​ సార్​.! మా సమస్యలు వినండి.. ప్రగతి భవన్​ ఎదుట యువతి హల్​చల్​

Last Updated : Jun 27, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.