ETV Bharat / crime

MURDER: గొడ్డలితో దాడి చేసి.. దారుణంగా హతమార్చి - rampet murder news

గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో జరిగింది. పాత గొడవలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

గొడ్డలితో దాడి చేసి.. దారుణంగా హతమార్చి
గొడ్డలితో దాడి చేసి.. దారుణంగా హతమార్చి
author img

By

Published : Jul 10, 2021, 10:11 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపేట్​లో దారుణం చోటుచేసుకుంది. వేల్పుల సమ్మయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

తలభాగంలో గొడ్డలితో రక్తపుమడుగులో సమ్మయ్య మృతదేహం

ఉదయపు నడక కోసం గ్రామ శివారులోకి వెళ్లిన సమ్మయ్యపై దుండగులు గొడ్డలితో దాడి చేశారు. తల భాగంలో విచక్షణారహితంగా నరికి.. ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న సమ్మయ్యను చూసి బోరున విలపించారు.

సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు సమ్మయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హత్యకు పాత గొడవలే కారణమై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: BABY DEATH: నీటితొట్టిలో 17 రోజుల పసికందు.. ఏం జరిగిందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.