సభ్య సమాజం తలదించుకునేలా.. వావివరసలను మరిచి చెల్లెలి(మైనర్ )పై కన్నేసిన ఓ కామాంధుడు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లాలో కలకలం రేపింది. కన్నాయిగూడెం మండలం వాసంపల్లిలోని ఓ యువకుడు(28) పెళ్లై.. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కామాంధుడి కళ్లు తన సొంత చిన్నాన్న కూతురిపై పడ్డాయి. పుష్పాలంకరణ శుభకార్యం నాటి నుంచి నువ్వంటే నాకిష్టమంటూ ఆ బాలికను బెదిరించి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, తన తల్లిదండ్రులనూ హతమారుస్తానని.... ఇల్లు తగల పెడతానని భయపెట్టినట్లు బాలిక తెలిపింది.
మూడు రోజుల క్రితం ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ములుగు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫోక్సో చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: