ETV Bharat / crime

Bike Hits tractor: ఘోర ప్రమాదం.. అన్నాచెల్లెలు సహా బాలుడు దుర్మరణం - అద్దంకి - నార్కెట్​పల్లి జాతీయ రహదారిపై ప్రమాదం

Bike Hits tractor: నల్గొండ జిల్లాలో ఓ ట్రాక్టర్​ను వెనుక నుంచి బైక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లెలు సహా ఓ బాలుడు మరణించాడు. ప్రమాద ధాటికి బైక్​ నుజ్జునుజ్జయింది.

Bike Hits tractor at narketpally highway
Bike Hits tractor
author img

By

Published : Jan 10, 2022, 11:27 PM IST

Bike Hits tractor: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ట్రాక్టర్​ను వెనుక నుంచి ఓ బైక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

అద్దంకి- నార్కెట్​పల్లి జాతీయ రహదారిపై బోత్తులపాలెం వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. మృతులు వాడపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు అంజి (21), అంజలి (17) అన్నా చెల్లెలు కాగా మరో 8 ఏళ్ల బాలుడు నవదీప్​గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీచూడండి: LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.