ETV Bharat / crime

పెళ్లింట విషాదం.. గుండెపోటుతో వరుడి తండ్రి మృతి.. - పెళ్లింట విషాదం

Tragedy in Wedding: కాసేపట్లో హర్షధ్వానాల నడుమ వైభవంగా పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో.. ఆర్తనాదాలు మిన్నంటాయి. మేళతాళాలతో సందడి నెలకొనాల్సిన పందిట్లో.. చావు డప్పులతో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్లారా కొడుకు పెళ్లి చూసి మనసారా ఆశీర్వదించాలనుకున్న ఆ తండ్రి.. గుండెపోటుతో కన్నుమూయటంతో.. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

bride groom father died with heart attack in jagtial

author img

By

Published : Feb 13, 2022, 3:49 PM IST

Tragedy in Wedding: జగిత్యాలలో ఓ పెళ్లింట తీరని విషాదం నెలకొంది. కాసేపట్లో పెళ్లి సందడి మొదలవుతుందనగా.. ఒక్కసారిగా పిడుగులాంటి వార్త ఆ ఇంటిని కుదిపేసింది. కుమారుని పెళ్లి ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ఆ తండ్రి.. వివాహం చూడకుండానే కన్నుమూశాడు.

జగిత్యాలలోని రవీంద్రనాథ్ ఠాగూర్​నగర్​కు చెందిన బందెల ఆంజనేయులు అనే ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ కుమారుని వివాహం ఈరోజు జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇంటి నిండా బంధువుల సందడి.. తెల్లారితే జరిగే పెళ్లికోసం అందరూ ఆయా కార్యక్రమంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆంజనేయులుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఏమవుతుందో తెలుసుకునేలోపే ఆంజనేయులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

ఈ ఘటనతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్తనాదాలతో పెళ్లిమంటమంతా మారుమోగింది. గతేడాదే.. ఆంజనేయులు చిన్న కుమారుడు ఎస్సారెస్పీ కెనాల్​లో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మరణించాడు. పెద్ద కుమారుని పెళ్లితోనైనా.. ఆ దుర్ఘటన నుంచి తేరుకోవచ్చని భావించిన వారి కుటుంబానికి మరోసారి తీరని విషాదమే మిగిలింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.