Boyaguda Fire Accident CC Footage: సికింద్రాబాద్ బోయిగూడలోని అగ్నిప్రమాదంలో సిలిండర్ పేలుడుతో తీవ్రత పెరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. విషాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంలో 11 మంది అగ్నికి ఆహుతి కాగా.. పరేమ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో అంతస్తులో నిద్రపోతున్న పరేమ్.. మొదటి అంతస్తు సజ్జపైకి దూకి.. అక్కడి నుంచి నేలమీదకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మిగతా 11మంది కార్మికులు గాఢ నిద్రలో ఉండటం వల్ల పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుకొని అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మంటలు ఉద్ధృతమై క్రమంగా భవనం రెండో అంతస్థులోకి చేరుకొని సజీవ దహనమయ్యారు. నలుగురైదురు కార్మికులు మంటల ధాటికి మెళకువ వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. ఎటూ వెళ్లలేక ఒకరిపై ఒకరు పడి పూర్తిగా కాలిపోయారు.
11 మంది అగ్నికి ఆహుతి
Fire Accident in Timber Depot : సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి.. పైనున్న టింబర్ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో కొంత మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది పొగతో ఊపిరాడక చనిపోయారు.
ఘటన జరిగిన సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఓ వ్యక్తి మంటలు వ్యాపించగానే అప్రమత్తమై భవనంపై నుంచి దూకాడాని చెప్పారు. ఆ విధంగా మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డాడని వెల్లడించారు. భవనంపై నుంచి దూకడం వల్ల గాయపడిన ఆ వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులను పోలీసులు పేర్కొన్నారు.
స్క్రాప్ గోదాము నుంచి టింబర్ డిపోకు..
Boyaguda Fire Accident : స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉండటం వల్ల తుక్కు గోదాము నుంచి మంటలు టింబర్ డిపోకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
తుక్కు గోదాం యజమాని కుమారుడు అరెస్ట్
పదకొండు మంది వలసజీవులను బలి తీసుకున్న సికింద్రాబాద్ బోయిగూడ తుక్కుగోదాం అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. తుక్కు గోదాం యజమాని సంపత్, అతని కుమారుడు శ్రవణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యజమాని సంపత్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముంబైలో ఎంబీఏ చదువుతున్న శ్రవణ్‌ను ఘటనాస్థలిలోనే అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: