Boy Missing in Jeedimetla : ఇంటి నుంచి తప్పిపోయిన బుడతడిని గంటలోనే ఇంటికి చేర్చారు పోలీసులు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌నగర్‌కు చెందిన మిథున్(4) గాజులరామారం రోడ్డులో సోమవారం ఏడుస్తూ కనిపించడంతో పెట్రోకార్ సిబ్బంది ఠాణాకు తీసుకొచ్చారు. ఎస్సై మన్మధరావు బాలుడి వివరాల్ని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా నోరు విప్పలేదు. బిస్కెట్లు ఇస్తేనే చెబుతాననడంతో తెప్పించారు. తింటూ వచ్చి రాని మాటలతో తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. బాలుడి వివరాల మేరకు.. సంజయ్‌గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. ఓ కిరాణ దుకాణం నిర్వాహకుడు గుర్తుపట్టి ఇంటిని చూపించాడు. పోలీసులు వెంటనే తండ్రి టింకుకు బాలుడు మిథున్‌ను అప్పగించారు.
పేరడిగితే.. గుక్కపెట్టి ఏడ్చాడు..
Boy Missing in Medchal : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం రోడ్డులో ఓ నాలుగేళ్ల బుడతడు ఏడుస్తూ కనిపించాడు. అటుగా వెళ్తున్న పెట్రోకార్ సిబ్బంది ఆ బాలుడిని చూసి ఆగారు. అతడి వద్దకు వెళ్లి వివరాలడగగా.. ఆ బుడతడు ఇంకా ఎక్కువగా ఏడవడం ప్రారంభించాడు. సిబ్బంది ఆ చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
చాక్లెట్ తింటావా నాన్నా..
Jeedimetla Police Rescued a Boy : అక్కడ ఎస్సై మన్మధరావు బాలుడి వివరాలు తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. మిథున్(4) నోరు విప్పలేదు. ఎంతసేపు బుజ్జగించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చిన్నారులను మచ్చిక చేసుకోవడానికి ఉపయోగించే సూపర్ పవర్‌ను ఎస్సై వాడారు. అదేంటంటే.. చాక్లెట్స్, బిస్కెట్స్.
బిస్కెట్ ఇస్తే చెబుతా..
Boy Was Rescued in Jeedimetla : నీకు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తాను.. నువ్వు ఎక్కడుంటావు నాన్నా. ఎలా తప్పిపోయావు. అమ్మానాన్న ఎవరు? వాళ్లెక్కడుంటారు అని మెల్లగా బుజ్జగిస్తూ ఎస్సై ఆ బుడతడిని అడిగారు. అప్పుడు మిథున్.. నాకు ఆకలేస్తోంది. బిస్కెట్ కావాలని అడుగుతూ బిస్కెట్ ఇస్తే చెబుతాననగా.. పోలీసులు ఆ బాలుడికి బిస్కెట్స్ తీసుకువచ్చారు. అవి తింటూ.. తనకు వచ్చీరాని మాటలతో తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు.
థాంక్యూ సర్..
మిథున్ చెప్పిన వివరాలతో పోలీసులు అతణ్ని సంజయ్‌గాంధీనగర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ చుట్టుపక్కల వాళ్లని బాలుడి గురించి ఆరా తీయగా.. ఓ కిరాణ దుకాణం యజమాని మిథున్‌ను గుర్తుపట్టి అతడి ఇంటిని చూపించాడు. పోలీసులు వెంటనే ఆ బాలుడిని తండ్రికి అప్పగించారు. తమ కుమారుడు కనిపించక చుట్టుపక్కలంతా వెతుకుతుండగా పోలీసులు మిథున్ని ఇంటికి తీసుకురావడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఇటీవలే చిన్నారుల కిడ్నాప్ ఘటనలు ఎక్కువవుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు సూచించారు.