రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమన్ నగర్ డివిజన్ ఇమాద్ నగర్ బస్తీలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వారిలో ఒకరు అమీర్ బేగ్ దొరుకగా, మరొకరు పరారీలో ఉన్నారు.
సంబంధిత కథనం: లైవ్ వీడియో: ప్రశ్నించిన పోలీసులపై దాడికి యత్నం..!
వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరూ రోడ్లమీద తీరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సులేమాన్ నగర్ కాలనీ పరిధిలోని ఇమాద్ నగర్ బస్తీలో… పోలీసులు గస్తీ కాస్తుండగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించకుండా, హెల్మెట్, మాస్క్ లేకుండా అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహించిన యువకుని సహోదరుడు పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళుతున్న యువకుడు కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు.
ఇదీ చూడండి: Geethanjali: డేటింగ్ యాప్లో నటి గీతాంజలి ఫొటోలు.. పోలీసులకు ఫిర్యాదు