ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన నగేశ్ (43) స్థానికంగా ఎలక్ట్రిషన్‌గా పని చేసేవాడు. పని ముగించుకుని బైక్‌పై లాల్‌బజార్ నుంచి తిరుమలగిరి చౌరస్తా వైపునకు వస్తుండగా వెనుకనుంచి ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు.. క్షణాల్లో ప్రాణాలు విడిచాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి