ETV Bharat / crime

బతుకుదెరువు కోసం వచ్చిన బీహారీ యువకుడు దారుణ హత్య... ఏం జరిగిందంటే... - భూదాన్ పోచంపల్లి తాజా వార్తలు

Murder in yadadri bhuvanagiri: బతుకుదెరువు కోసం ఊరి కాని ఊరు వచ్చి విగతజీవిగా మారాడు. ఓ లాబ్​లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న బీహార్​కు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ​యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది.

Murder in yadadri bhuvanagiri
హత్యకు గురైన బీహరి యువకుడు
author img

By

Published : Feb 28, 2022, 1:34 PM IST

Murder in yadadri bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఓ బీహార్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు.

అసలేం జరిగిందంటే...

బీహార్‌కి చెందిన నిరంజన్ కుమార్ అనే 22సంవత్సరాల యువకుడు పోచంపల్లి మండలం దోటిగూడెం గ్రామ శివారులోని రావూస్ లాబ్స్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు డ్యూటీ పూర్తి చేసుకున్న అతను మెడిసిన్ తెచ్చుకోవడం కోసం చౌటుప్పల్ వెళ్లాడు. రాత్రి అవుతున్నా అతను రూమ్‌కి తిరిగి రాలేదు. స్నేహితులు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. తెల్లవారు జామున చూస్తే కంపెనీ పక్కన ఉన్న వ్యవసాయ పొలం వద్ద కత్తిపోట్లతో హత్యకు గురై ఉన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన ప్రాంతంలో మద్యం సీసాలు ఉండడంతో రాత్రి అతనితో ఉన్న వారే హత్య చేశారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రేమ పేరుతో... బాలికను గర్భవతిని చేసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.