భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో త్రుటిలో పెను ముప్పు తప్పింది. కొద్ది రోజులుగా నిలిపివేసిన ఏడో దశ కర్మాగారంలో తిరిగి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయిల్ లీకై హెచ్‌పీ బైపాస్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
సిబ్బంది, కేటీపీఎస్ భద్రతా అధికారులు మంటలను గుర్తించి అప్రమత్తమయ్యారు. గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
- ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం.. 25 మందికి గాయాలు