ETV Bharat / crime

నకిలీ విత్తనాలు, గడ్డి మందుని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - telangana news

నిషేధిత మిరప విత్తనాలు, గడ్డి మందుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.77 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, పురుగుల మందులను సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
author img

By

Published : Jun 20, 2021, 4:33 PM IST

నిషేధిత మిరప విత్తనాలు, గడ్డి మందును పెద్దపల్లి టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగాపూర్ గ్రామ శివారులో తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.13.77 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, పురుగుల మందులను సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అంతరాష్ట్ర ముఠా గుట్టు ఛేదించామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.

భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం దానంపల్లికి చెందిన శ్రీనివాస ఎరువుల దుకాణం యజమాని శ్రీనివాస్... రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యూఎస్-341 రకం మిర్చి విత్తనాలతోపాటు నిషేధిత గడ్డి మందులు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్​లోని సదరు కంపెనీపై దాడులు నిర్వహించి పత్రాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుల మందులను విక్రయిస్తు... రైతులను మోసం చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని సీపీ సత్యనారాయణ ఘాటుగా హెచ్చరించారు. అలాంటివారిపై పీడీ యాక్టు కేసులు సైతం పెడుతున్నామని తెలిపారు . ఈ ఘటనలో తొగరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, హర్ష, రామకృష్ణ, వెంకట్ రెడ్డి, నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.