Fraud in UBI bank: జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్ యూబీఐ బ్యాంకులో భారీ మోసం వెలుగుచూసింది. అందులో విధులు నిర్వహించే బ్యాంకు మేనేజర్ సుమన్, క్లర్క్ రాజేశ్ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. వీరిద్దరిపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Union bank of India: వీరు మహిళా సంఘాలు, రైతులు బ్యాంకులో జమ చేసిన డబ్బులను తమ పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలోకి మళ్లించారు. తాము జమ చేసిన సొమ్ములో తేడా రావటంతో బ్యాంకు ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది క్రితమే ఈ స్కాం జరగగా ఇటీవల బదిలీపై వచ్చిన కొత్త మేనేజర్ మోతీలాల్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రూ.1,15,47,000లను సుమన్, రాజేశ్‌లు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు విచారణలో తేలింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మహిళా సంఘాలు, రైతులు, పర్సనల్ లోన్ల పేరుతో నగదు కాజేసి ఏమి ఎరగనట్లు ఉన్నారు. వారి ఇద్దరిని సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే మరింత మోసం వెలుగు చూసే అవకాశం ఉందని ఎస్సై అనిల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అనిశా వలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఎక్కడంటే?