ETV Bharat / crime

ఫుడింగ్​ పబ్​ కేసు.. మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్న పోలీసులు - ts news

Hyderabad Pub Case: పుడింగ్‌ పబ్‌ కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరిని వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఈనెల 3వ తేదీన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో 148 మంది ఉన్నారు. అందులో కొంతమందికి అభిషేక్‌తో పరిచయాలున్నట్లు గుర్తించారు. వారిలో ముగ్గురికి నోటీసులిచ్చారు.

ఫుడింగ్​ పబ్​ కేసు.. మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్న పోలీసులు

author img

By

Published : Apr 22, 2022, 3:16 PM IST

Hyderabad Pub Case: పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో మరో ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో 148 మంది ఉన్నారు. వారిలో కొంత మందికి నిందితుడు అభిషేక్‌తో పరిచయాలున్నట్లు గుర్తించిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ముగ్గురికి నోటీసులిచ్చారు. వారిలో రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రాలేనని మరో వ్యక్తి ఆదిత్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్‌కు అభిషేక్‌తో ఎంతకాలం నుంచి పరిచయం ఉందనే వివరాలు సేకరిస్తున్నారు.

బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్ రావు, హైదరాబాద్ నార్కోటిక్ విభాగం ఏసీపీ నర్సింగ్ రావులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. పబ్‌కు ఎన్నాళ్లుగా వెళ్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు గురువారం ఇద్దరిని ప్రశ్నించారు. ఆ ఇద్దరు కూడా టోనీ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు సైతం పబ్‌కు తరచూ వెళ్తుండటంతో పాటు.. అభిషేక్​తో దగ్గరి పరిచయాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ పట్టుబడటంతో, కొకైన్‌ను ఎవరు తీసుకొచ్చారనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Pudding Pub Case : పుడింగ్ పబ్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.