ETV Bharat / crime

NRI FAMILY DEATH CASE: ఆ కుటుంబాన్ని చంపేసింది.. వాళ్ల పెద్దకొడుకేనట! - latest news in vishaka

ఏపీ విశాఖలోని మధురవాడ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనంలో కుటుంబ సభ్యులంతా అనుమానాస్పదంగా మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన కేసులో కీలక ఆధారాలు లభించాయని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు.

bangarunayudus-family-were-suspiciously-killed-case-closed-in-a-multi-storey-building-near-madhuravada-in-visakhapatnam

author img

By

Published : Aug 14, 2021, 4:25 PM IST

అంతా పెద్ద కుమారుడే చేశాడు..

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని మధురవాడ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్థు భవనంలో బంగారునాయుడు కుటుంబ సభ్యులంతా అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో కీలక ఆధారాలు లభించాయని నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 15వ తేదీన కలకలం రేపిన ఈ ఘటనలో... తెల్లవారుజాము 2.30 నుంచి 4 గంటల మధ్యలో ఆ భవనం నుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికులు చూశారన్నారు. ఆ సమయంలో బాధిత కుటుంబసభ్యులు తప్ప ఇతరులెవరూ అపార్టుమెంటులోకి రాలేదని తెలిపారు. దీంతో బంగారునాయుడు పెద్ద కుమారుడు దీపకే అందరినీ హతమార్చినట్లు భావిస్తున్నామన్నారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు లభించినా పోస్టుమార్టం నివేదికలో ఎవరూ మద్యం తాగినట్లు నిర్ధరణ కాలేదని చెప్పారు. తల్లిదండ్రులు బంగారునాయుడు, నిర్మలతో పాటు సోదరుడు కశ్యప్‌లను హతమార్చిన తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను కాల్చటానికి అతడు మద్యాన్ని ఉపయోగించాడని వివరించారు. అప్పుడే దీపక్‌ చేయి కాలి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చివరకు అతడు కూడా చనిపోయినట్లు భావిస్తున్నామని అన్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారించామన్నారు.

ఆ రోజు ఏమైందంటే...

ఈ ఏడాది ఏప్రిల్‌ 15న మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ప్లాట్‌లో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. బంగారునాయుడు, నిర్మల దంపతులు కాగా.. వారి పిల్లలు 22 ఏళ్ల దీపక్‌, 19 ఏళ్ల కశ్యప్‌ ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు. బెహరాన్‌లో స్థిరపడిన బంగారునాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. బంగారునాయుడు భార్య నిర్మల హోమియో వైద్యురాలు, పెద్దకుమారుడు ఎన్‌ఐటీలో డిగ్రీ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. కశ్యప్‌ ఇంట‌ర్ చ‌దువుతున్నాడు. చనిపోయిన వారిలో పెద్దకుమారుడు మినహా మిగిలిన అందరిపైనా రక్తపు మరకలు ఉండటంతో.. కుటుంబ కలహాలతో అతడే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

Jagtial News : రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.