ETV Bharat / crime

పుడ్డింగ్ పబ్ కేసులో ఒకరికి బెయిల్​.. మరొకరికి నిరాకరణ..!

Pudding Pub Case: పుడ్డింగ్ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న ఇద్దరు నిందితుల్లో ఒకరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఏ1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్​కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Bail sanctioned to pudding pub case accused and Denaied to another

author img

By

Published : May 10, 2022, 9:14 PM IST

Updated : May 10, 2022, 9:30 PM IST

Pudding Pub Case: రాష్ట్రంలో సంచలనంగా మారిన పుడ్డింగ్ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్​కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్​కు.. కోర్టు షరతులతో కూడిన బెయిల్​ ఇచ్చింది. ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట అభిషేక్​ హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది. ఇదే కేసులో ఏ1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్​కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

గత నెల 3న తెల్లవారుజూమున టాస్క్​ఫోర్సు పోలీసులు పుడ్డింగ్ పబ్​పై దాడి చేశారు. పబ్ లో 4.6 గ్రాముల కొకైన్ లభించడంతో పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పబ్ యజమాని అభిషేక్​తో పాటు, మేనేజర్ అనిల్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మరికొంత మందిని ప్రశ్నించారు. విచారణ పూర్తైనందున బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో గత నెల 21 బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్​ను తిరస్కరించింది. మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది.. బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈసారి వాదనలు విన్న కోర్టు.. అభిషేక్​కు మాత్రం బెయిల్ మంజూరు చేయగా.. అనిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇవీ చూడండి:

Last Updated : May 10, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.