ETV Bharat / crime

Baby in Cemetery: ఓ వైపు కాలుతున్న శవాలు.. మరోవైపు సమాధులు.. మధ్యలో పసికందు - శ్మశానవాటికలో పసికందు

నవమోసాలు మోసి... చిన్నారికి ఊపిరిపోసింది. ఏం కష్టం వచ్చిందో మరి ఆ తల్లికి.. పుట్టిన బిడ్డను శ్మశానవాటికలో వదిలేసి వెళ్లిపోయారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే... అలా వదిలించుకుపోయారు.

Baby in the cemetery
శ్మశానవాటికలో పసికందు
author img

By

Published : Aug 16, 2021, 6:44 PM IST

ఓవైపు కాలుతున్న శవాలు.. మరోవైపు సమాధులు... మధ్యలో ఓ పసికందు. గొంతు చించుకుని ఏడుస్తూ ఉంది. అది విన్న స్థానికులు... దగ్గరికి వెళ్లి చూశారు. అయ్యే అప్పుడే పుట్టిన ఆ పసికందును చూసి తల్లడిల్లిపోయారు. ఎవరైనా ఉన్నారా అని వెతికారు. చుట్టు పక్కల చూసినా... లాభం లేకపోయింది. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ బాబును ఓడిలోకి తీసుకున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు.. శ్మశానవాటికలో వదిలేసినట్లు భావించారు. ఇక పోలీసులకు సమాచారం అందించారు.

బతికి ఉండగానే పసికందును శ్మశానవాటికలో వదిలేసిన ఈ ఘటన వరంగల్ నగరంలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు... శ్మశానవాటికలో వదిలివెళ్లారు. చిన్నారి పసికందు అరుపులు విన్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పసికందును స్థానికుల సహాయంతో.. పారిశుద్ధ్య సిబ్బంది హుటాహుటిన ఎంజీఎంకు తరలించారు. వైద్యులు ఆ పసికందుకు చికిత్స అందజేశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందు జన్మించినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవమోసాలు మోసి జన్మనిచ్చిన అనంతరం ఇలా పడేయడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు భారంగా భావిస్తే తల్లిదండ్రులు ఛైల్డ్​లైన్ సంప్రదించాలని కోరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.