ETV Bharat / crime

శిశువుల ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం!

రాష్ట్రంలో రెండు వేరు వేరు ఘటనల్లో ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి ఇద్దరు శిశువులు చనిపోయారు. వైద్యులు సరిగ్గా స్పందిచకపోవడం వల్లనే శిశువులు మృతి చెందారని బాధితులు ఆరోపిస్తున్నారు.

శిశువుల ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం!
శిశువుల ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం!
author img

By

Published : Jun 11, 2022, 10:19 AM IST

తెలంగాణలో భద్రాచలం, రాజన్న సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రుల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి ఇద్దరు శిశువులు చనిపోయారు. సాధారణ ప్రసవం కోసం వైద్యులు వేచిచూడటమే ఈ మరణాలకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన విజయకుమారి మొదటి కాన్పు కోసం ఈ నెల 6న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. నెలలు నిండిపోయినా నొప్పులు రాకపోవడంతో శస్త్ర చికిత్స చేయాలని కుటుంబ సభ్యులు కోరగా మిడ్‌ వైఫరీ(నర్సింగ్‌) సిబ్బంది ఒప్పుకోలేదు.

సాధారణ కాన్పు అవుతుందని చెప్పారు. కౌన్సెలింగ్‌ చేసి నొప్పులు వచ్చేవరకు వేచి ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ గర్భంలో శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఆమెకు జ్వరం వచ్చింది. అదేరోజు రాత్రి మరోసారి పరీక్షలు చేసిన సిబ్బంది హడావిడిగా శస్త్రచికిత్స చేసి 3.5 కిలోల బరువున్న ఆడ మృత శిశువును బయటకు తీశారు. ‘‘తల్లి కడుపులోనే శిశువు మృతి చెందినట్టు వైద్యులు’ చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

గైనకాలజిస్టుల కొరత

భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో కొంతకాలంగా రెగ్యులర్‌ గైనకాలజిస్టులు లేరు. ఒప్పంద పద్ధతిలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ప్రైవేటు వైద్యులను అవసరం ఉన్నప్పుడు పిలిపించి గౌరవ వేతనం ఇస్తున్నారు. విజయకుమారి పరిస్థితి విషమించినా ప్రైవేటు వైద్యులను పిలిపించకపోవడం విమర్శలకు దారితీసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన భూక్య ప్రియాంక తొలి కాన్పుకోసం గురువారం జిల్లా ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం నొప్పులు రావడంతో వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. శిశువు తల సగం బయటకు వచ్చి నొప్పులు ఆగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా పరికరాలతో బయటకు తీశారు. అప్పటికే శిశువుకు ఆక్సిజన్‌ అందక గుండె..ఊపిరితిత్తుల్లో కదలికలు తగ్గినట్టు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్సకోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ శిశువు మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు మృత శిశువుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆందోళనకు దిగారు.

ఈ ఘటనలపై భద్రాచలం, సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్‌లు డా.రామకృష్ణ, మురళీధర్‌రావు వివరణ ఇచ్చారు. సాధారణ ప్రసవం కోసం చివరి వరకూ ప్రయత్నించామని.. ఊహించని పరిణామాల వల్లనే శిశువులు మరణించారని తెలిపారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం లేదని వారు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.