ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి మండలంలో వరద ఉద్ధృతికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. నెల్లిమెట్ల వద్ద చిన్నేరు వాగు కాజ్‌వేపై నుంచి వరద నీరు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. వాగుని దాటే క్రమంలో... ఆటో కాజ్‌వేపై వెళ్తుండగా ఆటో నీటిలోకి జారిపోయింది. డ్రైవర్ సహా ముగ్గురు వెంటనే బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది. అనంతరం స్థానికులు ఆటోకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి: పిండ ప్రదానానికి వచ్చి గోదావరిలో కొట్టుకుపోయిన యువకుడు.. చివరికి..