ETV Bharat / crime

వ్యక్తిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. కార్లు పరస్పరం స్వల్పంగా ఢీ కొనడంతో జరిగిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేదాకా వెళ్లింది. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

Attacking with a sword  one person condition is poisoning  in vikarabad district
వ్యక్తిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
author img

By

Published : Mar 7, 2021, 12:01 PM IST

కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో వివాదం చెలరేగి నవీన్​ అనే వ్యక్తి పాండు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్​ కాలనీలో జరిగింది.

జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవీన్​, పాండు కార్లు శనివారం మధ్యాహ్నం స్వల్పంగా ఢీ కొన్నాయి. ఈ విషయమై ఇరువురు గొడవపడ్డారు. స్థానికులు సర్ది చెప్పడంతో అప్పటికి శాంతించి ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం నవీన్ మద్యం సేవించి ​ పాండు ఇంటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. చేతిలో ఉన్న కత్తితో పాండుపై దాడి చేశాడు. అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.