హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని గౌరీశంకర్ నగర్లో దారుణం జరిగింది. స్థానికంగా ఓ హోటల్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి చితకబాదారు. మత్తు పదార్థాల కొనుగోలుకు డబ్బులు అడగగా తమ వద్ద లేవని చెప్పడం వల్ల.. సీసాతో తలపై దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు.
ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు బిహార్‌కి చెందిన వారని తెలిపారు. తరచుగా ఇదే తరహా దాడులు జరుగుతున్నాయని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల హత్య: నిందితులకు14 రోజుల రిమాండ్