murder attempt at jagtial : జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ హోటల్లో యువకుడిపై అత్యాయత్నం జరిగింది. యువకుడి స్నేహితుడే కత్తితో దాడికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్, ప్రశాంత్ స్నేహితులు. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో మహ్మద్‌పై.. ప్రశాంత్ కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహ్మద్‌ను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: Inter student suicide : రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్.. ఉసురు తీసుకున్న విద్యార్థిని