ETV Bharat / crime

'ఆపరేషన్ గోవా' సక్సెస్.. డ్రగ్స్​ కీలక సూత్రధారి అరెస్ట్ - latest crime news

drug smuggler arrested: యువతను మత్తులో ముంచుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలకు డ్రగ్స్​ సరఫరా చేస్తూ, ఎవరికీ పట్టుబడకుండా తిరుగుతూ ఉన్న మాదకద్రవ్యాల సరఫరాదారుడు డిసౌజా అరెస్ట్​ అయ్యాడు. దీంతో మాదకద్రవ్యాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసుల నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. డ్రగ్స్​ సరఫరా చేస్తున్న కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Arrested for drug smuggler
డ్రగ్స్​ సరఫరాదారుడు అరెస్ట్​
author img

By

Published : Sep 22, 2022, 10:03 AM IST

drug smuggler arrested: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసేందుకు కొద్ది రోజుల క్రితం నగర నార్కోటిక్​ పోలీసులు.. గోవాకు వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అంజున బీచ్‌ అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాలకు మత్తు పదార్ధాలు అంటగడుతున్న వారిపై నిఘా ఉంచారు.

అంజున బీచ్‌ సమీపంలోని హిల్‌టాప్‌ రెస్టారెంట్‌ యజమాని, మాదక ద్రవ్యాల సరఫరా సూత్రదారి జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నూన్స్‌ను అరెస్టు చేశారు. వారిద్దరిలో ఒకరు కొవిడ్‌ సోకి, మరొకరు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్​పై నగరానికి తీసుకువచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్​ తీసుకొచ్చారు. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరాలో ఆరుగురు కీలక సూత్రదారుల కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఇంకా గాలిస్తున్నాయి.

డిసౌజా కీలక సూత్రధారి: గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు, ఇంకా కీలక నగరాలకు డిసౌజా డ్రగ్స్ సరఫరా చేసేవాడు. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీకి డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను మత్తులో ముంచుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఏజెంట్లను నియమించుకొని మరీ డ్రగ్స్​ దందా చేస్తూ, డార్క్ వెబ్‌సైట్‌లో విక్రయాలు జరుపుతూ ఉండేవాడు. కొద్ది నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న ఇతనిపై హైదరాబాద్​ నార్కోటిక్​ పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా గోవాలో ఉంటూ డిసౌజా కదలికలపై ఓ కన్నేశారు. గోవాలోని అంజున బీచ్​ సమీపంలో డిసౌజాను పట్టుకున్న పోలీసులు.. అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.