ETV Bharat / crime

బైక్​ల చోరీకి పాల్పడున్న యువకుడి అరెస్ట్​

జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఓ యువకున్ని నల్లకుంట పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి 6 బైక్​లను స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్​కు తరలించారు.

Arrest of a young man who was stealing two-wheelers in hyderabad
బైక్​ల చోరీకి పాల్పడున్న యువకుడి అరెస్ట్​
author img

By

Published : Mar 17, 2021, 7:48 PM IST

సులువుగా డబ్బు సంపాదించేందుకు బైక్​ చోరీలకు పాల్పడుతున్న ఓ యువకున్ని హైదరాబాద్​లోని నల్లకుంట పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమాదు చేసి రిమాండ్కు​ తరలించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన నల్లబోలు ముఖేశ్​(24) ఓ ప్రైవేటు రవాణా సంస్థలో డ్రైవర్​గా పనిచేస్తూ.. హైదరాబాద్​లోని సైదాబాద్ పూసల బస్తీలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు సులభంగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

నగరంలోని అంబుజా కాలనీలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిన బైకుతో ముఖేశ్​ వారికి చిక్కాడు. పత్రాలను చూపించమని అడగ్గా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తాను 6 బైక్​లను చోరీ చేశానని అతడు ఒప్పుకున్నాడని నల్లకుంట ఎస్సై తెలిపారు. 2017లో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డ ముఖేశ్​ జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నాారు. నిందితుడి వద్ద నుంచి 6 బైక్​లను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించామని చెప్పారు.

ఇదీ చదవండి: ' పాఠశాలల కొనసాగింపుపై సభలోనే ప్రకటిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.