ETV Bharat / crime

BLACK MAIL: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయించిన పోలీస్​ - blackmail

మహిళ స్నానం చేస్తుండగా తీసిన వీడియో, ఫొటోలు బయట పెడతామంటూ బెదిరించిన కేసులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్, మరో వ్యక్తిని అరెస్టు చేయగా, ఓ బాలుడిని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన జరిగింది.

BLACK MAIL
బ్లాక్​మెయిల్​ చేసిన పోలీస్​
author img

By

Published : Jul 3, 2021, 10:29 AM IST

అడిగినంత డబ్బు ముట్టజెప్పకపోతే మహిళ స్నానం చేస్తుండగా తీసిన వీడియో, ఫొటోలు బయట పెడతామంటూ బెదిరించిన కేసులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్, మరో వ్యక్తిని అరెస్టు చేయగా, ఓ బాలుడిని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని పాండవులమెట్టపై ఉన్న వైర్‌లెస్‌ రిపీటర్‌ సెంటర్‌లో ఐతే కనకారావు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అక్కడి సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శనానికి వచ్చిన సందర్భంలో మహిళా భక్తులు స్నానాలు చేస్తుండగా ఫొటోలు తీసి తనకు పంపించాలని ఆలయ అర్చకుడి బంధువు(బాలుడు)ను కనకారావు కోరాడు. ఆయన చెప్పిన ప్రకారం ఆ బాలుడు ఫొటోలు తీసి కనకారావు సెల్‌ఫోన్‌కు పంపించాడు.

అతడు వాటిని పెద్దాపురానికి చెందిన దళిత సంఘం నాయకుడు రొక్కం శ్యామ్‌ దయాకర్‌కు పంపించాడు. వాటి ఆధారంగా హెడ్‌ కానిస్టేబుల్, దళిత సంఘం నాయకుడు దేవాలయం నిర్వాహకుల కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఫొటోలు బయటపెట్టి మీ కుటుంబాన్ని బయటకు లాగడంతోపాటు ఆలయ విశిష్టతను దెబ్బతీస్తామని బెదిరించారు. దేవాలయం నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసి విచారణ జరిపారు. ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కనకారావు, రొక్కం శ్యామ్‌ దయాకర్‌పై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై ఆర్‌.మురళీమోహన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: నీ ఇన్​స్టా ఫొటో మార్ఫింగ్ చేశా.. డబ్బివ్వకపోతే వైరల్ చేస్తా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.