Fake Certificates: నకిలీ సర్టిఫికేట్ల కేసులో పోలీసులు మరో ఎనిమిది మందిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ద్రువపత్రాలు తయారు చేస్తున్న ముగ్గురితో పాటు... వాటిని తీసుకున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.
సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ నవీద్.. విదేశాలకు విద్యాభ్యాసానికి వెళ్లాలనుకునే వారికి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎక్కువ వచ్చినట్లు నకిలీ తయారు చేస్తున్నట్లు తెలిపారు. సర్టిఫికేట్లు, వర్సిటీలను బట్టి 70 నుంచి 80 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: