రుణయాప్‌ల కేసులో సైబర్ క్రైం పోలీసులు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన కలప్పను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. ఫీన్ ఎక్స్‌ప్రెస్ ఫైనాన్సియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కలప్ప డైరక్టర్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
హయ్ క్యాష్ అనే రుణయాప్కు సంస్థకు అనుబంధ సంస్థగా ఫిన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నట్లు వెల్లడించారు. రుణయాప్‌ల కేసులో ఇప్పటివరకూ ప్రధాన నిందితుడు ల్యాంబో సహా నాగరాజు, సింగి మధుబాబు, పల్లె జీవనజ్యోతితో పాటు.. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కలప్పను అరెస్టు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్ సంస్థలు కోట్ల రూపాలయలు రుణాలు ఇచ్చి... అప్పు తీసుకున్న వారిని వేధించారు. ప్రస్తుతం ఈ కేసుల నిందితులు సంఖ్య 22కి చేరగా.... వీరిలో చైనా దేశస్థుడు 'ఇ బాయ్' అలియాస్ డెనిస్‌తో పాటు మరో ముగ్గురిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఇప్పటి వరకు పలు సంస్థలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లోని 400కోట్ల రూపాయలను పోలీసులు స్తంభింపజేశారు. మరింత లోతుగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్