పెద్దపల్లి జిల్లాలో గత నెలలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడు వెల్ది వసంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంజపడుగు గ్రామానికి చెందిన వసంతరావు.. నీటిపారుదల శాఖలో డిప్యూటీ డీఈఈగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు. 2018లో పదవీ విరమణ చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో కుంట శ్రీనును.. వెల్ది వసంతరావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు.