ETV Bharat / crime

డ్రైవర్‌కు మూర్ఛ.. కందకంలో పడిన ఆటో.. వాహనంలో పదోతరగతి విద్యార్థులు - auto accident at nandi medaram

Auto Accident in Peddapalli
Auto Accident in Peddapalli
author img

By

Published : May 24, 2022, 9:13 AM IST

Updated : May 24, 2022, 11:59 AM IST

09:06 May 24

విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా కందకంలో పడిన ఆటో

Auto Accident in Peddapalli : పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ.... విద్యార్థుల ప్రాణాలతో కొందరు ప్రైవేటు వాహనదారులు చెలగాటమాడుతున్నారు. డబ్బులొస్తున్నాయనే ఆలోచనతో ఇష్టానుసారంగా పిల్లలను వాహనాల్లో ఎక్కిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇదే తీరుగా విద్యార్థులను కిక్కిరిసి ఎక్కించుకున్న ఓ ఆటో ప్రమాదానికి గురైంది.

పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పింది. రోడ్డుపక్కనున్న కందకంలోకి దూసుకెళ్లిన ఆటో ఆగిపోటవటంతో పెనుప్రమాదం తప్పింది. నందిమేడారం బాలికల గురుకులానికి చెందిన విద్యార్థినులు పదో తరగతి పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. అదే గ్రామంలో పరీక్ష కేంద్రం ఉండగా.... ఆటోలో వెళ్తున్నారు. కాగా.... ఒకే సారి ఆటో 20మందిని ఎక్కించుకున్న డ్రైవర్‌.... పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో డ్రైవర్‌కు మూర్చరావటంతో వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న గోతిలోకి ఆటో దూసుకెళ్లింది.

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆటో.... గోతిలోకి వెళ్లి ఆగిపోవటంతో.... వాహనంలో ఉన్న విద్యార్థినులకు ప్రమాదం తప్పింది. తీవ్రభయాందోళనకు గురైన విద్యార్థినులు తమవారికి సమాచారం ఇవ్వగా.... గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.

Last Updated : May 24, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.