Amberpet CI Sudhakar arrest: హైదరాబాద్‌లోని అంబర్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌పై వనస్థలిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎనిమిది నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో సర్వే నెంబర్ 54/2లో 10 ఎకరాల భూమి లావాదేవీలకు సంబంధించి ఓ ఎన్నారై నుంచి రూ.54 లక్షలకుపైగా నగదు తీసుకున్నట్లు సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి. బాధితుడు విజయనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్గౌడ్తో పాటు అంబర్‌పేట సీఐ సుధాకర్‌పై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు సీఐ సుధాకర్‌ను నేడు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ఏ-1గా ఉన్న రెవెన్యూ అధికారి రాజేశ్ గౌడ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజేశ్గౌడ్పై అనేక ఛీటింగ్ కేసులూ ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: