జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త పై ఓ భూమి విషయంలో ఆరోపణలు చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తులు కర పత్రాలు పంచడాన్ని అఖిలపక్ష నాయకులు ఖండించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్ సమీపంలోని భూమితో తనకు సంబంధం లేదని బాధితుడు వెల్లడించారు. కొందరు కావాలనే కక్ష పూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్తపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని వివిధ పార్టీల నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: తీన్మార్ మల్లన్న