విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళను ఓ ఏజెంట్ ట్రాప్ చేశాడు. ఏజెంట్ మాయ మాటలను నమ్మిన ఆ మహిళ దుబాయ్‌కి వెళ్లింది. అక్కడికి వెళ్లాకే.. తనను అమ్మేశారని తెలుసుకుంది.
బాధితురాలితో అరబ్‌షేక్‌లు వ్యభిచారం చేయించారు. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని ఇండియాకు చేరుకున్న బాధితురాలు... ఏంజెట్ రహీంపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ దుబాయ్ షేక్‌లకు అమ్మివేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
షేక్‌లు తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పోలీసుల ముందు గోడు వెల్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏజెంట్ రహీం కోసం రంగంలోకి ఎయిర్పోర్ట్ పోలీసులు దిగారు. ఇంకా ఎవరెవరిని మోసం చేశాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ రహీంతో పాటు... అతనికి సహకరించిన సాదీక్, హిమాన్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.
- ఇదీ చూడండి: వీడిన మిస్టరీ... హత్యకు వివాహేతర సంబంధమే కారణం