ETV Bharat / crime

వార్డ్​ మెంబర్​పై పోలీసుల​ దాడి.. తెరాసలో చేరాలని బెదిరింపులు.! - police harassed congress ward member news

Police attack on congress ward member: ఒక పార్టీలో ఉండి ప్రజలకు సేవచేస్తున్న తనపై.. పోలీసులు అకారణంగా దాడికి పాల్పడ్డారని ఓ వార్డ్​ మెంబర్​ ఆరోపించారు​. అధికార పార్టీలో చేరితే తనకు రూ. లక్షల్లో డబ్బిస్తానని ఆశజూపారని బాధితుడు పేర్కొన్నారు. కాదన్నందుకు విపరీతంగా కొట్టారని వాపోయారు. అవమానం భరించలేక పోలీస్​ స్టేషన్​ ఎదుటే ఆత్మహత్యకు యత్నించారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

police attack on congress ward member
కాంగ్రెస్​ సభ్యుడిపై పోలీసుల​ దాడి
author img

By

Published : Mar 20, 2022, 4:35 PM IST

Police attack on congress ward member: నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల దాష్టీకం తారాస్థాయికి చేరింది. అచ్చంపేట మండలం చెదురు బావి తండాకు చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు మాతృనాయక్​పై ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్​.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని బాధితుడి బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. హోలీ పండుగ రోజు రోడ్డుపై తన దారిన తాను వెళ్తుండగా అడ్డగించి మరీ.. పోలీస్​స్టేషన్​కు లాక్కెళ్లి కొట్టారని బాధితుడు వాపోయారు. తాను ఎంత బతిమిలాడుతున్నా కరుణించలేదని పేర్కొన్నారు. దాహంగా ఉంది.. మంచినీళ్లు ఇవ్వండని అడిగినా కనికరం చూపలేదని విలపించారు. లాఠీతో విచక్షణారహితంగా దాడి చేశారని పేర్కొన్నారు. తెరాసలోకి వెళ్తే రూ. 10 లక్షలు ఇప్పిస్తా.. కాంగ్రెస్​ను విడిచి తెరాసలో చేరమని బెదిరించారని చెప్పారు. కాదన్నందుకు మళ్లీ దాడికి పాల్పడ్డారని వివరించారు. అనంతరం బయటకు వచ్చాక.. అవమానం, పోలీసుల దౌర్జన్యం భరించలేక పోలీస్​ స్టేషన్​ ఎదుటే మాతృనాయక్​ ఆత్మహత్యకు యత్నించాడు.

అసలేం జరిగింది...

"హోలీ పండుగరోజు మా బంధువును దింపడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. నేను అక్కడినుంచి వెళ్లిపోయాను. మా బంధువును దింపి.. తిరిగి వస్తుండగా ఎస్సై ప్రదీప్​ నాయక్​, ఏఎస్సై అంజయ్య, కానిస్టేబుల్​ రాంబాబు అడ్డుకుని పోలీస్​ స్టేషన్​కు లాక్కెళ్లారు. అక్కడ నాపై విపరీతంగా దాడికి పాల్పడ్డారు. దెబ్బలు తాళలేక చచ్చిపోతున్నా అన్నా కూడా ఊరుకోలేదు. దాహమేస్తుంది మంచి నీళ్లు ఇవ్వమన్నా.. కనికరించలేదు. నన్ను తెరాస కార్యకర్తగా చెప్ఫుకోమంటున్నారు. అధికార పార్టీలో చేరితే రూ. 10 లక్షలు ఇప్పిస్తా అంటున్నారు. కానిస్టేబుల్​ మాటలకూ ఎస్సై వంతపాడారు. నేను చస్తే ఒప్పుకోనని చెప్పేసా." -మాతృనాయక్​, కాంగ్రెస్​ వార్డు మెంబర్​

ఆత్మహత్యాయత్నం

బయటకు వచ్చిన అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఎదుటు బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​ పార్టీ నాయకులు బాధితుడికి మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

వార్డ్​ మెంబర్​పై పోలీసుల​ దాడి

ఇదీ చదవండి: 23 మంది భాజపా నాయకులు జ్యుడీషియల్ రిమాండ్​కి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.