Accused Arrest in Minor Rape Case : ఏపీలోని గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా 11 మంది నిందితులను అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 61 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ మాయమాటలు చెప్పి బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.
అసలేం జరిగింది..
minor rape accused arrest : బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో అయిదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బారిన పడటంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులు తండ్రి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటు వైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపారు. కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను వ్యభిచారంలోకి దింపింది.