పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డి గూడెంలోని తన ఇంటి నుంచి.. ఉదయంపూట మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతుండగా.. మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కిందపడిన రామయ్య కాలుకు తీవ్ర గాయమైంది.
సమాచారం అందుకున్న రామయ్య కుటుంబసభ్యులు వెంటనే.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరిండెంట్ బి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంపీ సంతోష్‌కుమార్.. రామయ్య ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఇవీ చూడండి: