పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సమీపంలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన బైక్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకాలే ప్రయాణికులతో వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టాయి.
ఈ ఘటనలో ఎన్టీపీసీ పవర్ ప్లాంటులో కూలీ పనులకోసం ఆటోలో వెళ్తున్న ఆరుగురు మహిళలతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆటోలోని ఇద్దరు మహిళలు, డ్రైవరుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను గోదావరిఖని ప్రభుత్వ ఏరియా అసుపత్రికి తరలించారు. గోదావరిఖని నుంచి పెద్దపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: 'ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలు ప్రకటించండి'