హైదరాబాద్, ఎస్ఆర్నగర్ ఎస్సై.. అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కాడు. ఓ కేసు సెటిల్‌మెంట్ విషయంలో.. లంచం డిమాండ్ చేసిన భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
గత నెల బల్కంపేట్లో ఆటోలో అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్ గోధుమల కేసుపై భాస్కర్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమానికి పాల్పడ్డ ఆటో ట్రాలీని వదిలేసేందుకు.. ఎస్సై రూ.25 వేలు డిమాండ్ చేశారనే విషయం అనిశా దృష్టికి వెళ్లింది. ఆటో యజమాని.. ఎస్సైకు డబ్బులు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి: పొదుపు మహిళల ఖాతాల్లో సొమ్ము స్వాహా.. సీబీఐ కేసు నమోదు