ETV Bharat / crime

ఆత్మహత్యకు ముందు యువతి చివరి మాటలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Young woman drank insecticide taking a selfie video: ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది.. అన్నీ తానే అనుకుని అయిన వాళ్లను వదులుకొని ప్రేమించిన వాడి కోసం వెళ్లిపోయింది. హాస్టల్​లో ఉంటే అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికితే అతని మాట విని అక్కడ చేరింది. పాత విషయాలు గుర్తు చేసి ఆమెను చిత్రహింసలు చేసినా భరించింది. కానీ చివరికి పెళ్లి చేసుకో.. అంటే చేసుకోను .. ఆ బాధను ఎవరితో చెప్పాలో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా ఆత్మహత్యకు పాల్పడింది.

young women suicide
యువతి ఆత్మహత్య
author img

By

Published : Oct 7, 2022, 1:20 PM IST

ఆత్మహత్యకు ముందు తేజశ్రీ సెల్ఫీ వీడియో

Young woman drank insecticide taking a selfie video: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం షంషీర్​ నగర్​లో జరిగింది. యువతి ఆత్మహత్యకు పాల్పడటం.. చుట్టు పక్కల గ్రామాల్లో కలకలం సృష్టించింది. సెల్ఫీ తీసుకుంటూ యువతి చెప్పిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి.

బెల్లంపల్లి పట్టణం షంషీర్​ నగర్​కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబడితాండ గ్రామానికి చెందిన ధరావత్​ రాజ్​ కుమార్​ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి గత కొన్ని నెలలుగా హాస్టల్​లో ఉంటుంది. ఇంట్లో వాళ్ల మాటను పట్టించుకోకుండా ప్రేమికుడి మాటలు నమ్మింది. చివరికి అతడు ఆ యువతిపై నిందలు మోపి పెళ్లికి నిరాకరించడంతో ఏమి చేయాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఈ మొత్తం విషయాన్ని సెల్​ఫోన్​లో సెల్ఫీ వీడియో తీసింది.

ధరావత్​ రాజ్​కుమార్​ ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగింది. బెల్లంపల్లి నుంచి ఆటోలో లంబతాండకు బయలుదేరి, నెన్నెల టీ రోడ్డు వద్దకు రాగానే తనకు కళ్లు తిరుగుతున్నాయని యువతి ఆటో డ్రైవర్​తో చెప్పింది. అతను ఆమెను స్థానిక పీహెచ్​సీకి తరలించాడు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాజ్​ కుమార్​ వల్లనే తన కుమార్తె ప్రాణం తీసుకుందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.