Faint on Electric Pole: వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఓ విద్యుత్ కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నారాయణ పేటకు చెందిన విద్యుత్ కార్మికుడు ఆత్మకూరులో.. కరెంటు స్తంభాలపై మరమ్మతులు చేస్తున్నారు. ఆ క్రమంలో యువకుడికి స్తంభంపైనే మూర్ఛ వచ్చింది. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనే కుప్పకూలిపోయాడు.
యువకుడు స్తంభం పైన స్పృహ లేకుండా పడిపోవడాన్ని గమనించిన ఇద్దరు తోటి కార్మికులు.. నిచ్చెన సహాయంతో అతనిని సురక్షితంగా కిందకు దించారు. విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలైన కార్మికుడిని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గా ఉంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: జీలుగు కల్లు తాగి నలుగురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం