ETV Bharat / crime

DEATH: వేట కోసం వెళ్లి.. విద్యుదాఘాతానికి బలయ్యాడు! - The young man went hunting and died in nagarkurnool

వన్యప్రాణుల వేట కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

వేట కోసం వెళ్లి మృత్యువాత
వేట కోసం వెళ్లి మృత్యువాత
author img

By

Published : Jun 1, 2021, 11:27 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగిలి చిగుర్ల వెంకటేశ్​ అనే చెంచు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

గ్రామానికి చెందిన చిగుర్ల వెంకటేశ్​, బిచ్చమయ్యలు ఇద్దరు వన్యప్రాణుల షికారు కోసమని ఆదివారం రాత్రి అటవీ ప్రాంతానికి వెళ్లారు. కాటి చెలక బావి అటవీ ప్రాంతంలో గంటల శంకర్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు ప్రమాదవశాత్తు తగిలి వెంకటేశ్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇది గమనించిన బిచ్చమయ్య వెంటనే గ్రామానికి చేరుకుని విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ACCIDENT: కొవిడ్‌ను జయించి.. విధికి తలొంచి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.